Posts

*చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్*

Image
 *చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్* *రంగారెడ్డి, సెప్టెంబర్ 17, 2026:* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. లంచం తీసుకుంటూ సబ్-ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏసీబీ కథనం ప్రకారం..* చేవెళ్ల డివిజనల్ సబ్-ట్రెజరీ ఆఫీస్ లో పనిచేస్తున్న - *AO-1: మాదిగ లక్ష్మయ్య - సబ్-ట్రెజరీ ఆఫీసర్* - *AO-2: కావలి అనూరాధ - అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్* ఒక ఉద్యోగి సస్పెన్షన్ కాలపు జీతం బిల్లులు రూ. 23,25,390/- మరియు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బకాయిలు రూ. 4,29,000/- ప్రాసెస్ చేసినందుకు గాను రూ. 2,50,000/- లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ. 1,00,000/- తీసుకుంటుండగా ఏసీబీ రంగారెడ్డి రేంజ్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. AO-1 లక్ష్మయ్య రూ. 50,000/- నేరుగా తీసుకోగా, AO-2 అనూరాధ చెప్పడంతో మిగిలిన రూ. 50,000/- ను *A3: వడ్డే జంగయ్య @ చిన్న (ప్రైవేట్ వ్యక్తి)* తీసుకున్నాడు. ఇద్దరి నుండి లంచం సొమ్మును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ముగ్గ...

*టీజీపీసీబీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం*

Image
 *టీజీపీసీబీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం* *సనత్‌నగర్, సెప్టెంబర్ 17:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) సనత్‌నగర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని దేశభక్తి, గౌరవభావంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతను, తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, ఐక్యతను గుర్తుచేశారు. తెలంగాణ సాధించిన ప్రగతి ప్రజల త్యాగాలు, ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. *పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి: చైర్మన్* అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని చైర్మన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భ...

*ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకే ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి*

Image
* ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి* *హైదరాబాద్:* ఉప్పల్ భగాయత్ లో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్యవైశ్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని *మహాసభ ప్రక్షాళన కమిటీ తొలి విజయం* గా చెప్పుకోవచ్చు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి *"నిర్మిస్తున్న ఈ ఆత్మగౌరవ భవన్ పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఉపయోగపడాలి. ఆర్యవైశ్యులంతా కలిసి ఉండండి, రాజకీయాల్లో రాణించండి"* అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆర్యవైశ్యులు పేదలకు ఎలాంటి పూచీ లేకుండా ఉద్దెర ఇచ్చి ఆదుకుంటారని కొనియాడారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ ఆర్యవైశ్యలకే ఇచ్చామని తెలిపారు. ఆత్మగౌరవ భవన్ కు ఆర్థిక సహాయం కోరారని, నిబంధనల మేరకు చేస్తామని తెలిపారు. *ఎందుకు ఇది ప్రక్షాళన కమిటీ విజయం?* గత కొన్ని నెలలుగా మహాసభ ప్రక్షాళన కమిటీ లేవనెత్తుతున్న ప్రధాన డిమాండ్ ఇదే. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవన్ కేవలం కొందరు పెద్దలకోసం, ఫంక్షన్ హాల్ గా మిగిలిపోకుండా.. ప...

ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post వైరల్ అవుతుంది 👇👇👇👇👇

Image
ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post మస్తు వైరల్ అవుతుంది మరి ఈ పోస్ట్ రేవంత్ రెడ్డి కి చేరేనా? ఆలోచించినా అన్న డిస్కస్ పెరుగుతుంది 👇👇👇👇👇 ఈ క్రింది లింక్ టచ్ చేసి చూడొచ్చు https://www.instagram.com/reel/DdLsIJmRH1a/?stkn=MWw1eWMzaXpjd2pjYg==  

*CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో*

Image
 *CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో* *హైదరాబాద్, సెప్టెంబర్ 10:* ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మెడికల్ రీయింబర్స్ మెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. తెలంగాణ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న *ఆనందేశి రాఘవేందర్ (A-1)* మరియు TSIDC (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పరిశ్రమ భవన్, బషీర్ బాగ్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న *మేడి వినోద్ (A-2)* లను బుధవారం సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి CMRF మెడికల్ రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేసి, మంజూరైన రూ.2 లక్షలకు చెక్కు ఇప్పించి, మిగిలిన క్లెయిమ్ ను కూడా ప్రాసెస్ చేసేందుకు A-1 రాఘవేందర్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. అంతకు ముందే PhonePe ద్వారా A-2 వినోద్ ద్వారా రూ.5,000 లంచం తీసుకున్నాడు. ఏసీబీ వల వేయగా ఫిర్యాదుదారుడి నుంచి A-2 వినోద్ రూ.లక్ష తీసుకుని A-1 రాఘవేందర్ కు అందజేశాడు. రాఘవేందర్ వద్ద నుంచి ఆ తడిసిన రూ.లక్ష నోట్లను ఏసీ...

*నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి*

Image
 *నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి* *నల్లగొండ:* వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. శాంతి సంఘ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. - ప్రతి గణేష్ మండపాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. - ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించడం, డ్రంక్ డ్రైవింగ్ వంటివి చేయరాదు. - ఫేక్ న్యూస్, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. అలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. - నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. - డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలి. - ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దు. *"ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుందాం. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం"* అని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి చే...

*మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం*

Image
  *మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం* *రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన భరతక్క, వనజక్కలకు సత్కారం* *వరంగల్, తేదీ:* ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన నేపథ్యంలో, రైతుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రజా ఉద్యమ నేత అక్కరాజు హరిగోపాల్ అలియాస్ రామకృష్ణ సతీమణి సింగు సిరిష అలియాస్ భరతక్క, సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి పటేల్ వనజ అలియాస్ కాపురి వనజక్కలను ఈ సందర్భంగా సత్కరించారు.         ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మేరు సంఘం నాయకులు మునగాల రమేష్, మునగాల రాము, జిల్లా నాయకులు రాయబారు సంతోష్ తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగా వెంకటరాజం మాట్లాడుతూ... "మేరు జాతిలో పుట్టి రైతుల హక్కులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కో...