Posts

*అంగన్ వాడీల నుంచి మామూళ్లు.. రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన CDPO*

Image
 *అంగన్ వాడీల నుంచి మామూళ్లు.. రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన CDPO* *జగిత్యాల, సెప్టెంబర్ 26:* జగిత్యాల జిల్లాలో మహిళా శిశు సంక్షేమ అధికారి అవినీతి బయటపడింది. మెట్ పల్లి CDPO ఏసీబీ వలలో చిక్కింది. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.144 ప్రకారం..* నిందితురాలు *దారోజు పద్మ, CDPO, మెట్ పల్లి, జగిత్యాల జిల్లా* ను కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఈరోజు రూ.63,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* మెట్ పల్లి అర్బన్ మండలం పరిధిలోని 21 అంగన్ వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల రిమార్కులు రాయకుండా ఉండేందుకు CDPO పద్మ మామూళ్లు డిమాండ్ చేసింది. ఒక్కో అంగన్ వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000/- చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకు (రూ.3,000 x 21 కేంద్రాలు) మొత్తం రూ.63,000/- లంచం అడిగింది. ఫిర్యాదుదారుడి నుంచి తన కార్యాలయం ఆవరణ బయటే నేరుగా లంచం డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుండి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారిక సహాయం చేసేందుకు అక్రమంగా లబ్ధి పొందినట్లు ఏసీబీ నిర్ధారించింది....

నల్గొండ నుంచి న్యూయార్క్ వరకు డా. జగదీశ్వర్ రావు 46 ఏళ్ల ప్రయాణం

Image
   నల్గొండ నుంచి న్యూయార్క్ వరకు డా. జగదీశ్వర్ రావు 46 ఏళ్ల ప్రయాణం విద్యార్థి నాయకత్వం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా.. హార్వర్డ్ నుంచి అంతర్జాతీయ అకడమిక్ వేదికల వరకు హైదరాబాద్, సెప్టెంబర్ 24, 2026: నల్గొండ జిల్లాలో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైన డా. జగదీశ్వర్ రావు వీరనేని ప్రయాణం విద్య, సామాజిక ఉద్యమాలు, పరిశోధన, మీడియా, రాజకీయ-సామాజిక కార్యకలాపాలు, అంతర్జాతీయ అకడమిక్ సహకారం వంటి అనేక రంగాల్లో కొనసాగింది. సుమారు 46 ఏళ్ల ఈ ప్రయాణంలో విద్యార్థి నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా, పరిశోధకుడిగా, ప్రొఫెసర్‌గా, విద్యా మాధ్యమాల పరిశోధకుడిగా ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. డా. జగదీశ్వర్ రావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా Educational Multimedia Research, Digital Media Research, Online మరియు Web-based Education రంగాల్లో బోధన, పరిశోధన చేస్తున్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ Educational Multimedia Research Centre (EMRC) డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 16 ఏళ్ల వయసులోనే విద్యార్థి నాయకత్వం నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల సామాజిక పరిస్థితులను స...

ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

Image
 *నల్గొండలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు* *నల్గొండ, సెప్టెంబర్ 27:* నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు *కట్టెల శివకుమార్* మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లను ఎదిరించి పోరాడిన గొప్ప ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నల్గొండ జిల్లా మహిళా డిగ్రీ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బండారు శంకర్, కమ్మల నరేష్ కుమార్, సంఘం గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆదిమల్ల లింగయ్య, పెన్షనర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్.కె. జానీమియా, జిల్లా నాయకులు ఈరిగి బిక్షం, కొండన్న, సుధీర్, నరేందర్ తదిత...

*NIMS అదనపు సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.6.13 కోట్ల అక్రమాస్తులు*

Image
 *NIMS అదనపు సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.6.13 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి* *హైదరాబాద్, సెప్టెంబర్ 22:* నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ అవినీతి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. *ఎవరిపై కేసు?* *నోరి లక్ష్మీ భాస్కర్ (56), తండ్రి సత్యనారాయణ, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, NIMS, హైదరాబాద్.* నివాసం ఫ్లాట్ నెం.811, A బ్లాక్, కల్పతరు అపార్ట్ మెంట్స్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఉద్యోగంలో ఉండగా అక్రమ మార్గాల ద్వారా తన ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. అవినీతి నిరోధక చట్టం 13(1)(b) మరియు 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అతని నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మరో ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. *సోదాల్లో ఏం దొరికింది?* ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ చూస్తే దిమ్మతిరిగేలా ఉంది. దాదాపు *రూ.6.13 కోట్ల* విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఇది డాక్యుమెంట్ విలువ మాత్రమే...

*బండ్లగూడ RTO ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు బట్టబయలు*

Image
 *బండ్లగూడ RTO ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు బట్టబయలు* *హైదరాబాద్, సెప్టెంబర్ 22:* బండ్లగూడలోని సౌత్ జోన్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ సర్‌ప్రైజ్ చెక్‌లో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలోని సిబ్బంది సెల్‌ఫోన్లను పరిశీలించగా అనుమానాస్పద UPI లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా కార్యాలయం లోపల అనధికారికంగా ఏజెంట్లు సంచరిస్తూ దరఖాస్తులతో కనిపించడం ఏసీబీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏజెంట్ల వద్ద నుండి ఏకంగా రూ.24,760 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొందరు అధికారులు ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయడానికి వాటిపై ప్రత్యేక సంకేతాలు, పేర్లు రాస్తున్నట్లు తేలింది. ఇలా చేస్తున్న వారిలో AOలుగా పనిచేస్తున్న బి.సునీత, ఎన్.హేమంత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు మహ్మద్ ఇమ్రాన్, కె.సాయి కుమార్, జూనియర్ అసిస్టెంట్లు కె.బాబూజీ, టి.సాయికాంత్, అలాగే MA లతీఫ్ ఖాన్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అదనంగా సీనియర్ అసిస్టెంట్ స...

కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ!

Image
 కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ! టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినం సందర్భంగా బృహత్తర సేవా సంకల్పం • సెప్టెంబర్ 22న సంగారెడ్డి ఐబీలో భారీ రక్తదాన శిబిరం • ఉదయం 10:30 గంటలకు ప్రారంభం.. ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు • "మన బలం.. మన కలం.. మన రక్తం.. ఒకరి ప్రాణం" నినాదంతో నిర్వహణ స్ఫూర్తి నినాదం: "మీరు చేసే ఒక్క రక్తదానం.. ఒక ప్రాణానికి పునర్జన్మ" "మన బలం.. మన కలం.. మన రక్తం.. ఒకరి ప్రాణం" సంగారెడ్డి : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైసల్, జిల్లా ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీన సంగారెడ్డి స్థానిక ఐబీ (IB) ప్రాంగణంలో ఈ శిబిరం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది.   పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత కార్యక్రమంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వా...

*నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి - రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్*

Image
 *నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి - రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్* *నిజామాబాద్, సెప్టెంబర్ 21:* నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న - *AO-1: పాల్ద అశోక్ - జూనియర్ అసిస్టెంట్ (ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్)* - *AO-2: కలకుంట్ల కిరణ్ కుమార్ - ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (ఆడిట్ సెక్షన్)* ఇద్దరినీ నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 11.18 గంటలకు నిజామాబాద్ టౌన్ లోని రాజా రాజేంద్ర చౌరస్తా దగ్గర, సీతారాంనగర్ కాలనీలోని పద్మశాలి సంఘం వద్ద రూ.15,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఎందుకు లంచం అడిగారు?* ఫిర్యాదుదారుడి తల్లి సర్వీస్ బుక్ లో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ తయారు చేసి, అవసరమైన ఎంట్రీలు చేసి నెలవారీ పెన్షన్ మంజూరు చేయడానికి ఈ లంచం డిమాండ్ చేశారు. అక్రమంగా రూ.15,000 లబ్ధి పొంది తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ నిర్ధారించింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లిలోని II అడిషనల్ స్పెషల్ జడ్జి ఫర...