*మ్యుటేషన్ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్*
*మ్యుటేషన్ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్* *సిద్దిపేట, అక్టోబర్ 06:* సిద్దిపేట జిల్లాలో మరో అవినీతి ఉద్యోగి ఏసీబీ వలలో పడ్డారు. నారాయణరావుపేట మండలంలో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. *AO-1: శ్రీమతి బి. అరుణ, పంచాయతీ కార్యదర్శి, జక్కాపూర్ గ్రామం, నారాయణరావుపేట మండలం* *AO-2: దాసరి సంతోష్, కాంట్రాక్ట్ కారోబార్, జక్కాపూర్ గ్రామం* అక్టోబర్ 06, 2026 ఉదయం 11 గంటల ప్రాంతంలో జక్కాపూర్ పంచాయతీ ఆఫీసులో ఇద్దరూ రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడి పేరు మీద రెండు ఇళ్లకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తు ఫైల్ను ఫార్వార్డ్ చేసి ప్రాసెస్ చేయడానికి పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం డిమాండ్ చేసింది. మొదట రూ.20,000 అడిగి, చివరకు రూ.15,000 కు బేరం కుదుర్చుకుంది. ఆ డబ్బును కారోబార్ సంతోష్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్నారు. లంచం సొమ్ము రూ.15,000 ను AO-2 సంతోష్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఏసీ...