*కోరుట్ల RTA ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ 7 అవకతవకలు*
*కోరుట్ల RTA ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ 7 అవకతవకలు* *జగిత్యాల, అక్టోబర్ 06:* జగిత్యాల జిల్లా కోరుట్లలోని యూనిట్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 06, 2026న కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు కోరుట్ల RTA ఆఫీసులో సర్ ప్రైజ్ చెక్ చేశారు. ఆఫీసు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలానాలు, పెండింగ్ దరఖాస్తులు, మొత్తం కార్యాలయ పనితీరును పరిశీలించారు. *తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు:* *1.* MVI లేకుండానే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ N. గిరీష్ కుమార్ డ్రైవింగ్ టెస్ట్లు నిర్వహిస్తూ, వాహనాల రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నట్లు గుర్తించారు. *2.* అధికారిక పనుల కోసం ఏజెంట్ల ద్వారా ప్రజల నుండి అదనపు డబ్బు వసూలు చేస్తున్నారు. *3.* సామాన్య ప్రజలు చేసిన దరఖాస్తుల విషయంలో ఏజెంట్లకు ఆఫీసులోకి పూర్తి స్వేచ్ఛ ఉంది. పని పూర్తయ్యే వరకు RTA సిబ్బందితో వారే డీల్ చేస్తున్నారు. *4.* రికార్డులు, రిజిస్టర్లను సరిగా నిర్వహించడం లేదు. *5.* సబార్డినేట్ల పని మరియు కేటాయించిన విధులపై పర్యవేక్షణ లేదు. *6.* డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాల్సిన ప్రదేశం రవాణా శా...