జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలింపునకు ఈటల పోరుబాట
జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలింపునకు ఈటల పోరుబాట 27 నుంచి బాధితులతో పాదయాత్ర.. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు రాజీపడేది లేదన్న మల్కాజిగిరి ఎంపీ హైదరాబాద్, అక్టోబర్ 25: జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తీవ్ర కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు రాజీపడే ప్రసక్తే లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. డంపింగ్‌యార్డును తరలించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 నుంచి బాధిత ప్రజలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జవహర్‌నగర్ డంప్‌యార్డు కాలుష్య నియంత్రణ, సమస్యలకు శాశ్వత పరిష్కారంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పర్యావరణవేత్తలు దొంతి నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, దామోదర్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలత...