*పెట్రోల్ బంక్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్, ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ వలలో*


 *పెట్రోల్ బంక్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్, ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ వలలో*


*యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28:* పెట్రోల్ బంక్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇచ్చినందుకు లంచం డిమాండ్ చేసిన లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు మంగళవారం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


*ఏసీబీ అధికారులు వెల్లడించిన సమాచారం  ప్రకారం..* యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, అతని అనుచరుడు కసారం రవీందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ఈ కేసులో నిందితులు. రవీందర్ పెట్రోల్ పంప్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.


ఫిర్యాదుదారుడికి చెందిన పెట్రోల్ బంక్ కు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేసి, డైలీ సేల్స్ రిజిస్టర్ అప్పగించినందుకు బహుమానంగా ఇన్ స్పెక్టర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. తనకు బదులుగా ప్రైవేట్ వ్యక్తి రవీందర్ ద్వారా లంచం తీసుకోవాలని ప్లాన్ వేశాడు.


ఇన్ స్పెక్టర్ సూచనల మేరకు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రవీందర్ రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందులో రూ.15 వేలు ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు, రూ.5 వేలు రవీందర్ కు చెందాల్సి ఉందని విచారణలో తేలింది.


లంచం సొమ్ము రూ.20 వేలను రవీందర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లబ్ధి కోసం ఇన్ స్పెక్టర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ పేర్కొంది. ఇద్దరు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు