*అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షలు.. రూ.లక్షకు బేరం కుదుర్చుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ ఏసీబీ వలలో*


 *అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షలు.. రూ.లక్షకు బేరం కుదుర్చుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ ఏసీబీ వలలో*


*హైదరాబాద్, అక్టోబర్ 28:* కోర్టు కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏసీబీ కేసులో చిక్కుకున్నాడు.


*ఏసీబీ ప్రెస్ నోట్  ప్రకారం..* బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ కొట్టూర్ విజయ్ పై క్రిమినల్ మిస్ కండక్ట్ కేసు నమోదు చేశారు.


బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కోర్టు రిఫరల్ ద్వారా నమోదైన క్రైమ్ నెం. 524/2024, 525/2024 కేసుల్లో ఫిర్యాదుదారుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఎస్ఐ మొదట రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత అది రూ.లక్షకు కుదిరింది.


అరెస్ట్ చేయకుండా 41-A Cr.P.C. కింద నోటీసులు ఇచ్చి, ఫిర్యాదుదారుడు ఇచ్చే సమాధానాలు స్వీకరించి, ఈ వ్యవహారంలో కొత్త కేసులు నమోదు కాకుండా చూస్తానని హామీ ఇచ్చి లంచం కోసం ఒత్తిడి చేశాడు. అక్రమ లబ్ధి కోసం తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ గుర్తించింది.


నిందితుడైన ఎస్ఐని నాంపల్లిలోని 1వ అదనపు ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలు వెల్లడించడం లేదని ఏసీబీ తెలిపింది.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు