*కేసు క్లోజ్ చేయాలంటే రూ.6 లక్షలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మిర్చౌక్ ఇన్ స్పెక్టర్, హోంగార్డు*
*కేసు క్లోజ్ చేయాలంటే రూ.6 లక్షలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మిర్చౌక్ ఇన్ స్పెక్టర్, హోంగార్డు*
*హైదరాబాద్, అక్టోబర్ 27:* కేసు మాఫీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన మిర్చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్, హోంగార్డు ఏసీబీ వలలో చిక్కారు.
* మిర్చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎం. కొండల్ రావు, అదే స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆబిద్ అలీని సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైన కేసును క్లోజ్ చేయడానికి, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో సహకరిస్తామని చెప్పి ఇన్ స్పెక్టర్ రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా రూ.3 లక్షలను హోంగార్డు ఆబిద్ అలీ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది.
లంచం సొమ్ము రూ.3 లక్షలను హోంగార్డు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ లబ్ధి కోసం వ్యవహరించారని ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదు.

Comments
Post a Comment