హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు: తాజ్ ఫలక్‌నుమా, మెహఫిల్ సహా 22 ప్రముఖ రెస్టారెంట్లపై చర్యలు, 14 హోటళ్లు బంద్!
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు: తాజ్ ఫలక్‌నుమా, మెహఫిల్ సహా 22 ప్రముఖ రెస్టారెంట్లపై చర్యలు, 14 హోటళ్లు బంద్! హైదరాబాద్: నగరంలోని బిర్యానీ, కబాబ్స్ మరియు వెజ్ టిఫిన్స్ ప్రియులకు తెలంగాణ ఆహార భద్రతా విభాగం (TG SAFE) షాకింగ్ వార్త అందించింది. భాగ్యనగరంలో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత ఏ విధంగా ఉందో బయటపెడుతూ అధికారులు శనివారం (అక్టోబర్ 31, 2026) భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని 22 ప్రముఖ రెస్టారెంట్లలో 22 ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కిచెన్లలో బొద్దింకలు, ఈగల ముప్పు, కుళ్ళిన మరియు బూజు పట్టిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలు నిల్వ ఉంచడం అధికారులను విస్మయానికి గురిచేసింది. వీటన్నింటికీ మించి వెజ్ (శాకాహార) పదార్థాలతో కలిపి పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లలో స్టోర్ చేయడం, కిచెన్ గోడలు మురికిగా ఉండటం, వాడిన వంట నూనెనే పదే పదే వాడటం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. 544 కిలోల కలుషిత మాంసం ధ్వంసం: ఈ దాడుల్లో భాగంగా దాదాపు 544 కిలోల కుళ్ళిన, కలుషితమై...