*టీజీపీసీబీలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.. సర్దార్ పటేల్ కు నివాళి*


 *టీజీపీసీబీలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.. సర్దార్ పటేల్ కు నివాళి*


*హైదరాబాద్, అక్టోబర్ 31:* ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రధాన కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేస్తామని, ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


స్వాతంత్ర్యం తర్వాత దేశంలోని పలు సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి దేశ ఐక్యతకు పటేల్ చేసిన అసమాన కృషిని అధికారులు స్మరించుకున్నారు. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, భాషలతో కూడిన భారతదేశాన్ని ఐక్యంగా నిలపడంలో ఆయన చారిత్రక పాత్రను కొనియాడారు. పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జాతీయ సమగ్రత, సోదరభావ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు