రేణుక–చిరంజీవి వివాహం వైభవంగా.. రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు
రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి రేణుక వివాహం, చిరంజీవితో అత్యంత వైభవంగా జరిగింది. అమీర్‌పేట్‌లోని ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టరేట్’ ఈ ఘనమైన వేడుకకు వేదికైంది.
సమాజంలో దిక్కులేని వారికి అండగా నిలవాలనే సంకల్పంతో రూపాయి ఫౌండేషన్ నిర్వాహకులు ఈ పెళ్లి బాధ్యతను భుజాన వేసుకున్నారు. నూతన వధూవరులకు అవసరమైన పుస్తె మట్టెలు, తాళి, మరియు పెళ్లి సామాగ్రిని ఫౌండేషన్ తరఫున ఉచితంగా అందజేశారు. వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులు, అతిథులందరికీ ఘనంగా భోజన సదుపాయాన్ని కల్పించారు.
ఈ వివాహ వేడుకను రూపాయి ఫౌండేషన్ ప్రాజెక్టు చైర్మన్ జగిని శ్రీనివాస్ - అనిత దంపతులు, కో చైర్మన్ యడవెల్లి బాలరాజు - రమ దంపతులు, మరియు ఫౌండర్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ - అరుణ దంపతులు +91 92465 76070దగ్గరుండి నడిపించి విజయవంతం చేశారు.
ఒక అనాథ బాలికకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేసిన రూపాయి ఫౌండేషన్ ప్రతినిధుల సేవా నిరతిని, మానవత్వాన్ని పలువురు ప్రముఖులు, స్థానికులు ప్రశంసించారు. నూతన వధూవరులు రేణుక - చిరంజీవి దంపతులు నూరేళ్లూ వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. నిరుపేదలు, దివ్యంగ జంటలు, అనాధ జంటలు మమ్మల్ని సంప్రదిస్తే ఉచితంగా వివాహం జరిపిస్తామని జగిని శ్రీనివాస్ తెలిపారు. వివరాలకు +91 92467 36533 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

Comments
Post a Comment