*తుఫానుతో కోదాడ నియోజకవర్గంలో వరి పంటకు నష్టం.. రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు బీజేపీ నేత వినతి*
*తుఫానుతో కోదాడ నియోజకవర్గంలో వరి పంటకు నష్టం.. రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు బీజేపీ నేత వినతి*
*సూర్యాపేట:* అక్టోబర్ 27, 28 తేదీల్లో వచ్చిన తుఫాను వల్ల కోదాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలపాలైందని, రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆయన వినతి సమర్పించారు. తుఫాను వల్ల వరి పంట తడిసి గాలికి ఒరిగి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కోత దశలో ఉన్న వందలాది ఎకరాల వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమగ్ర నివేదిక తెప్పించుకుని, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద పంట నష్టపరిహారం రైతులకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment