# టీజీపీసీబీ సమావేశ హాల్ ముందు విజిటర్స్ చైర్స్ దగ్గర కాలుష్య నమూనాల నిల్వ!
# టీజీపీసీబీ సమావేశ హాల్ ముందు విజిటర్స్ చైర్స్ దగ్గర కాలుష్య నమూనాల నిల్వ! ## ప్రయోగశాలకు చేరాల్సిన శాంపిళ్లు కుర్చీల పక్కన.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా? ### నమూనాల భద్రతపై నీలినీడలు.. పరీక్షల జాప్యంపై సమాధానం చెప్పేదెవరు? **హైదరాబాద్:** పర్యావరణ పరిరక్షణకు కీలక బాధ్యత వహించాల్సిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) కార్యాలయంలోనే విస్మయకర దృశ్యం కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన కాలుష్య పరీక్షల నమూనాలు ప్రయోగశాలకు చేరాల్సి ఉండగా, ఏకంగా కార్యాలయంలోని సమావేశ హాల్ ముందు విజిటర్స్ చైర్స్ పక్కన ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు అధికారుల పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సమావేశ హాల్లో వరుసగా కనిపిస్తున్న క్యాన్లలో అసలు ఏయే రకాల నమూనాలు ఉన్నాయి? కేవలం నీటి నమూనాలేనా? లేక పరిశ్రమల నుంచి సేకరించిన వ్యర్థ జలాలు, రసాయన వ్యర్థాలు, చెరువులు, నదులు, భూగర్భ జలాల నమూనాలు కూడా ఉన్నాయా? మట్టి, ఘన వ్యర్థాలు, పరిశ్రమల కాలుష్య ఉద్గారాల పరీక్షలకు సంబంధించిన నమూనాలు సైతం ఉన్నాయా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి...