Posts

*పెండింగ్‌లో ఉన్న రూ.7,500 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలి.. నల్గొండ కలెక్టర్‌కు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వినతి*

Image
 *పెండింగ్‌లో ఉన్న రూ.7,500 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలి.. నల్గొండ కలెక్టర్‌కు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వినతి* *నల్గొండ, నవంబరు 15:* పెండింగ్‌లో ఉన్న రూ.7,500 కోట్ల స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీలు, మెస్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం బహుజన పేద విద్యార్థుల స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, అగ్రవర్ణ పేద బిడ్డలు ఉన్నత చదువులకు దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్య కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయ...

# మోయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి ఆస్తులు రూ.6.76 కోట్లు!

Image
 # మోయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి ఆస్తులు రూ.6.76 కోట్లు! ## ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ సోదాలు.. భారీగా స్థిర, చరాస్తుల గుర్తింపు ### గతంలో రూ.75 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారిణి **హైదరాబాద్:** ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఆదాయ వనరులకు మించి అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం (16-11-2026) ఆమె నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. **రూ.6.76 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!** ఈ సోదాల్లో భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను అధికారులు గుర్తించారు. ఏసీబీ ప్రెస్‌నోట్ ప్రకారం గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. **స్థిరాస్తులు:** 1. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల ఓపెన్ ప్లాట్. 2. జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల మరో ఓపెన్ ప్లాట్. ఈ రెండు ప్లాట్ల విలువ రూ.87.67 లక్షలు. 3. రంగారెడ్...

సాత్పురా టైగర్ రిజర్వ్ అధికారి ఇంట్లో భారీగా బంగారం, నగదు పట్టివేత.. రూ. 7.6 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

Image
  సాత్పురా టైగర్ రిజర్వ్ అధికారి ఇంట్లో భారీగా బంగారం, నగదు పట్టివేత.. రూ. 7.6 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ శర్మ నివాసాలపై లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో పచ్‌మఢీ, ఛింద్వారాలోని ఆయన అధికారిక మరియు ప్రైవేట్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో అధికారులకు సుమారు 2.528 కిలోల బంగారు ఆభరణాలు , 1.656 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 26.36 లక్షల నగదు లభించింది. వీటితో పాటు రెండు రిసార్టులు, నాలుగు విలాసవంతమైన వాహనాలు, 28 భూమి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ. 7.6 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి లోకాయుక్త పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

*ఎరుపెక్కిన నల్లగొండ*

Image
 *ఎరుపెక్కిన నల్లగొండ* *ఎర్రజెండాల హోరు.. నినాదాల జోరు..* *-రైతు మహాప్రదర్శనతో దద్దరిల్లిన నల్లగొండ టౌన్.. ఎటుచూసినా ఎర్రసైన్యమే* *నాటి సాయుధ పోరాట స్ఫూర్తి.. నేడు రైతాంగ మహాప్రదర్శన రూపంలో ప్రతిధ్వని* *దింసా నృత్యాలు.. కోలాటాలు.. చెక్కభజనలు.. డీజే సప్పులు.. ఎడ్లబండ్ల సందడి* *నాలుగు కిలోమీటర్ల మేర కదం తొక్కిన రైతాంగం.. విప్లవాల ఖిల్లాపై ఎర్రజెండాల ప్రభంజనం* *నల్లగొండ, నవంబర్15* : నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లాగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా కేంద్రం మరోమారు ఎర్రజెండాల రెపరెపలతో, రైతు నినాదాలతో ఎరుపెక్కింది.  ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన ఖిల్లా... చరిత్రలో ఎన్నో ప్రజా పోరాటాలకు వేదికైన నల్లగొండ మరోసారి ఎర్రజెండాల రెపరెపలతో పులకించిపోయింది.  అడుగడుగునా రైతాంగ ఉత్సాహం.. వీధివీధినా విప్లవ నినాదాల హోరు.. ఎటుచూసినా ఎర్రజెండాల సందడితో జిల్లా కేంద్రం అట్టుడికిపోయింది.  అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణంలో అదివారం నిర్వహించిన రైతుల మహాప్రదర్శన అట్టహాసంగా సాగింది.  వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని తమ...

*రిటైర్డ్ సీఈకి మూడు సీఈ పోస్టులతో ఎక్స్‌టెన్షన్.. రద్దు చేయాలని ఇంజినీర్ల సంఘాల డిమాండ్*

Image
 *రిటైర్డ్ సీఈకి మూడు సీఈ పోస్టులతో ఎక్స్‌టెన్షన్.. రద్దు చేయాలని ఇంజినీర్ల సంఘాల డిమాండ్* *హైదరాబాద్, నవంబరు 15:* నీటిపారుదల శాఖలో పదవీ విరమణ పొందిన ఓ చీఫ్ ఇంజినీర్‌కు మూడు సీఈ పోస్టులతో మరో ఆరు నెలలు ఎక్స్‌టెన్షన్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఇంజినీర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రిటైర్డ్ ఇంజినీర్లకు తిరిగి పదవీ పొడిగింపులు ఇవ్వడం వల్ల జూనియర్ ఇంజినీర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చీఫ్ ఇంజినీర్ క్యాడర్‌లో వరుసగా ఎస్‌ఈలకు ప్రమోషన్లు కల్పించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిందిపోయి రిటైర్ అయిన ఇంజినీర్లనే తిరిగి అదే క్యాడర్ పోస్టుల్లో నియమిస్తోందని, దీనివల్ల పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఐదు క్యాడర్లలో ఇంజినీర్ల ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటున్నాయని సంఘాలు పేర్కొన్నాయి. ఎస్‌ఈలుగా ఉన్నప్పుడు ఎక్స్‌టెన్షన్ల కారణంగా సరైన సమయంలో ప్రమోషన్లు పొందలేకపోయిన వారే సీఈలుగా, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లుగా పదవీ విరమణ అనంతరం కూడా తిరిగి ఎక్స్‌టెన్షన్ల కోసం ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయమని తెలిపాయి. ప్రభుత్వం ఎ...

సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరపాలి! సీఎంకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ

Image
  సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరపాలి! సీఎంకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ గోల్డ్ చోరీ కేసు, హామ్ వే వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ హైదరాబాద్: మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ వ్యవహారాల్లో సజ్జనార్ పాత్ర, పోలీసుల దర్యాప్తు తీరు, కేసుల పురోగతిపై అనేక ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంటూ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గోల్డ్ చోరీ కేసులో ఇప్పటివరకు ఆశించిన పురోగతి ఎందుకు కనిపించడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ కేసులో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయా? బాధ్యులుగా అనుమానిస్తున్న వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? దర్యాప్తు ఏ దశలో ఉంది? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. కేసులో జాప్యానికి కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అదేవిధంగా హామ్ వే కేసు దర్యాప్తు కూడా నత్తనడకన సాగుతోందని రాజాసింగ్ ఆరోపించారు. ఈ కేసులో విచారణ ఎందుకు వేగవంతం కావడం ...

ఈ నెలలోనే ఏడుగురు అవినీతి అధికారుల అరెస్ట్*

Image
  *తెలంగాణలో ఏసీబీ కొరడా.. ఈ నెలలోనే ఏడుగురు అవినీతి అధికారుల అరెస్ట్* *హైదరాబాద్, నవంబరు 15:* తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారాల ఆట కట్టించేందుకు ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. కేవలం ఈ ఒక్క నెలలోనే ఏడుగురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ప్రభుత్వ పనుల కోసం వచ్చే సామాన్య ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే పక్కా వ్యూహంతో వలపన్ని అవినీతి అధికారులను పట్టుకుంటోంది. కీసర సబ్ ఇన్‌స్పెక్టర్ కొండారెడ్డి శ్రీనివాస్ బాధితుడిపై ఉన్న కేసుల్లో విచారణ వేగవంతం చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఏకంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. భైంసా ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఒక పని నిమిత్తం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. విద్యుత్ శాఖ అధికారులు పాత మీటర్ల స్థానంలో కొత్త కరెంట్ మీటర్లను మంజూరు చేయడానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఆమ...