*మునుగోడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలు*


 *మునుగోడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలు*


*మునుగోడు, నవంబరు 15:* ప్రముఖ పాత్రికేయుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలను మునుగోడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మునుగోడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సామాజిక, పర్యావరణ ఉద్యమ నాయకులు జీడిమెట్ల రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ తోట నరసింహాచారి షోయబుల్లాఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా షోయబుల్లాఖాన్ నిజాయితీ జర్నలిజానికి ప్రతీకగా నిలిచారని, ప్రజాస్వామ్య విలువలు, పత్రికా స్వేచ్ఛ, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. షోయబుల్లాఖాన్ తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల దౌర్జన్యాలను ప్రశ్నించారని, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత, పత్రికా స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక సంపాదకుడిగా నిర్భయంగా ప్రజల గొంతుకగా నిలిచారని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, జర్నలిస్టు నాయకులు గుర్రాల పరమేష్, కోణం రమేష్ నేత, బేరి రవీందర్, బీఎస్పీ సీనియర్ నాయకులు గుర్రాల నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎడవెల్లి సురేష్ గుప్తా, బొల్లు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు