సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీ & కమీషనర్ గా చక్కా ప్రియాంక బాధ్యతల స్వీకరణ


 


సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీ & కమీషనర్ గా చక్కా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ :



సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా సి.హెచ్. ప్రియాంకా నేడు భాద్యతలు స్వీకరించారు. శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న సిహెచ్. ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేడు ఉదయం సచివాలయంలో డా.హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తో పాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా భాద్యతలను స్వీకరించారు. 

         స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎండిగా వెళ్లిన డా. హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిషోర్ బాబు, అడిషనల్ డైరెక్టర్ జగన్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్