**ఘనంగా సుధా బాంక్ ఆత్మీయ సమ్మేళనం**


ఘనంగా సుధా బాంక్ ఆత్మీయ సమ్మేళనం


సుధా బాంక్ నల్గొండ 6వ వార్షికోత్సవ సందర్బంగా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా బాంక్ చైర్మెన్ మీలా మహాదేవ్ బాంక్ బ్రోచర్ను విడుదల చేసి ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలిపారు. బాంక్  మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్  బాంక్ పథకాలు, ప్రణాళికలు వివరించారు. వైస్ చైర్మన్ పొరెడ్డి మధుసూదన్ రెడ్డి, భోనగిరి భాస్కర్, చామల అశోక్ కుమార్, దంతాల శ్రీనివాసులు నాయుడు పాల్గొన్న ఈ సమావేశంలో కాళోజీ పురస్కారం  అందుకున్న ప్రముఖ కవి వేణు సంకోజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గోలి అమరేందర్ రెడ్డి, ఏచూరి శైలజ, శ్రవణ్ కుమార్, కాసోజు సీతా రాములు, గుండమ రాజు శ్రవణ్ కుమార్, ఆడిటర్ చక్రపాణి, తదితరులు పాల్గొని ప్రసంగించారు. బాంక్ మేనేజర్  భీష్మా చారి వందన సమర్పణ చేశారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*