Skip to main content

**సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  *ఆర్టీసీ కండక్టర్... ఆవేదన తో రాజీనామ లేఖ**

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 


*ఆర్టీసీ కండక్టర్... ఆవేదన తో రాజీనామ లేఖ*


*సూర్యాపేట డిపోకు చెందిన ఉద్యోగి*


*అర్వపల్లి మండలం, సూర్యానాయక్ తండా కు చెందిన లూనావత్ కృష్ణ*


 గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి.... 


 తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్న ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ  మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను  రా నాయనా అనే విధంగా గా తీవ్ర  మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను.....


మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మికలోకం లేట్ గా తెలుసుకుంది మీరు ఉద్యోగం లో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దానికి కారణం లేకపోలేదు సర్ మా తెలంగాణ లో నియంతృత్వ0 చూస్తా అని అనుకోలేదు.1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా  చూసుకుంటారు అనుకున్న.కానీ సర్ మా 30 మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది సర్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని , నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఉహించలేదు సర్ కానీ మీ బంగారు తెలంగాణ లో అది సాధ్యం అయింది సర్,నా చెల్లెలు ఏడుస్తుంటే, రోజు నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్న సర్ కానీ ఒక్కటి మాత్రం నిజం సర్ నా RTC అక్క చెల్లెల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సర్,   నేను సూర్యాపేట డిపో లో RTC కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న   మీలాంటి  ఒక మోసకారి ఒక మాటకారి ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ  ప్రభుత్వంలో నా ఆత్మభిమన్నాన్ని చంపుకొని  ఉద్యోగిగా పని చేయలేను  అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న నా పేరు యల్.కృష్ణ నా స్టాప్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సర్. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుండి  నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి ayya  CM సర్ గారు మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి.ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి.పాపం సర్ RTC వాళ్ళు సర్ మీమ్ములను చాలా అభిమానించారుసర్ కానీ మీరు ఇలా  చేస్తారు అని కలలో కూడా ఉహించిఉండరు సర్, పాపం RTC వాళ్ళు సర్ వాళ్లకు వచ్చే 15000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవం గా బ్రతుకుతున్నారు సర్.మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకున్న కనీసం పిలిచి మాట్లాడి ఉంంటే మీమీద గౌరవం తో ప్రాణాలు ఇచ్చేవారు సర్.కనీసం నేను మీ బంగారు తెలంగాణ లో సంతోషంగా లేను మా తల్లిదండ్రులు సర్ కనీసం వాళ్ళను అయిన సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి ఎందుకంటే మిమ్ములను నమ్మి మీకు మా కేసీఆర్ అని ఓటు వేశారు సర్.వాళ్ళు బాధపడుతుంటే సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను దినంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్. ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది ఈ లాఠీ దెబ్బలు ఏంది నా RTC  సోదరులు ఏమి  తప్పు చేశారు అని  ఇంకా ఎంత మంది ని ఆత్మహత్యలు చేస్కునేట్టు చేస్తారు.అందుకే   ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని  చంపుకొని ఉద్యోగం చేయలేను. అందుకే   నేను మీ బంగారు తెలంగాణా లో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు.మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజం లోని వ్యక్తిని నీ  తెలంగాణ రాష్ట్ర0 లో నిరుద్యోగిగా  ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి.  పేరు మీద అ సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి  ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్న సమాజంలో
 గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగె నా ఉద్యోగ రాజీనామా ను తక్షణమే ఆమోదించగలరు.



                ఇట్లు ///
   L కృష్ణ 
స్టాఫ్ నెంబర్ 176822
RTC క0డక్టర్ సూర్యాపేట డిపో.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్