విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి.... భవిష్యత్ లో ఏమి కావాలో పాఠశాల లోనే నిర్ణయించుకోవాలి.... విద్యార్థులకి తెలుగు, ఇంగ్లిష్ భాష లపై పట్టు సాధించాలి..... జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట: విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ఇష్టం తో చదివి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాక్షించారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో,సిబ్బందితో మాట్లాడినారు..ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, వ్యక్తులు చేసే వృత్తి ద్వారా సమాజంలో గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తును రూపొందించడానికి పాఠశాల స్థాయి నుండే కష్టపడాలని తెలిపారు. విద్యార్థులకి తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించాలని తెలిపారు. బోధనా పద్ధతులు,భాషా నైపుణ్యాలను పొందడంలో విద్యార్థుల పురోగతి సాధించాలని,విద్యార్థులు క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ, నెమ్మదిగా నేర్చుకునేవారికి...