ABVP ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ


 ABVP ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ

నల్గొండ: 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్  మాట్లాడుతూ...బతుకమ్మ ప్రత్యేకతలు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, మహిళా శక్తి ప్రతీకగా ఉన్నదనాన్ని విశదీకరించారు.తెలంగాణ ఆడపడుచులు దేవతా స్వరూపిణులుగా భావించి కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతి, ఆయురారోగ్యాలు కోరుకుంటూ ఈ వేడుకను నిర్వహిస్తారని వారన్నారు.బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాకుండా, తెలంగాణ జాతి సాంస్కృతిక గుర్తింపుగా నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణవారు ఏకమై తమ మట్టిమనసు చూపించే వేళగా ఈ పండుగ నిలుస్తుందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ABVP రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశ్ణు గారు, నల్గొండ విభాగ్ ప్రముఖ్ ప్ర‌మోద్ , రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఛత్రపతి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ABVP యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్, కార్యదర్శి మోహన్, ప్ర‌త్యూష, వెంకటేష్, విజయ్, సాయి, మౌనేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్