ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు


 ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నల్గొండ: 

 ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 21-03-2026 శనివారం రోజు ఉదయం 10.30 లకు నల్గొండ క్లాక్ టవర్ సమీపంలోని డైన్ ఇన్ హోటల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మరియు నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధుల తో పాటు నల్గొండ పట్టణ ప్రముఖులు అనగా మేయర్ డిప్యూటీ మేయర్ తదితరులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలకు తంబోలా ఇతర ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వబడును ఎర్లీ బర్డ్ బహుమతి ప్రధానం కూడా చేస్తారు.

 అనంతరం భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడినదనీ, భోజన విరామం తర్వాత ప్రజా ప్రతినిధులకు సన్మానం, చివరిగా ఐ వి ఎఫ్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసామని నిర్వాహకులు తెలిపారు.

  ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు మహిళ విభాగ్ అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పబ్బా చంద్రశేఖర్ గుప్తా, మహిళా నాయకురాలు శ్రీమతి ఉప్పల స్వప్న, శ్రీమతి చందా భాగ్యలక్ష్మి, శ్రీమతి మంజుల తదితర రాష్ట్ర నాయకుల తో పాటు నల్గొండ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, శ్రీమతి గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, శ్రీమతి అబ్బ గోని కవితా రమేష్, శ్రీమతి యమా కవితా దయాకర్ తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని, ఐవీఎఫ్ సభ్యులు ఆర్యవైశ్య మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు.

 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ