Posts

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తా - నూతన కలెక్టర్ బి .చంద్రశేఖర్

Image
 గూఢచారి, నల్గొండ, డిసెంబర్ 31:  ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ బి .చంద్రశేఖర్ తెలిపారు.               రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు.                అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తాను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.          ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.         నూతన జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి. చంద్రశేఖర్ కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీవో వై...

నల్లగొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి నిజాంబాద్‌కు బదిలీ - నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్

Image
నల్లగొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి నిజాంబాద్‌కు బదిలీ నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ నియామకం. నల్లగొండ:  *నల్లగొండ జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి..* *ప్రజల సమస్యలపై సత్వర స్పందనతో తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు..* *రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారంలో పారదర్శక పాలనకు ప్రాధాన్యం...* *రైతు సంక్షేమం కోసం సాగునీటి, పంట బీమా అంశాలపై ప్రత్యేక దృష్టి.!* *విద్య, ఆరోగ్య శాఖల్లో మెరుగైన సేవల కోసం క్షేత్రస్థాయి పర్యటనలు..* *మహిళా, బాలల భద్రతకు సంబంధించి కఠిన నిర్ణయాలతో పలు ప్రశంసలు..* *ప్రభుత్వ పథకాలు అర్హుల వరకు చేరేలా నిరంతర సమీక్షలు..* *అధికార యంత్రాంగంలో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం..* *నల్లగొండ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి..*

స్వర్ణ గిరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప్పల కుటుంబం

Image
స్వర్ణ గిరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప్పల కుటుంబం* వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని ప్రసిద్ధ స్వర్ణ గిరి దేవాలయాన్ని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధులు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు. శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని, ఈ రోజున స్వామివారి దర్శనం చేయడం వల్ల ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని తెలిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేద పండితుల ఆశీర్వాదం అందించిన మానేపల్లీ గోపి, మానే పల్లి మురళి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న కుమారుడు ఉప్పల సాయి కిరణ్ చిన్న కుమారుడు ఉప్పల సాయి తేజ అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్త బావ బచ్చ సతీష్ , సోదరీమణి ఉదయ శ్రీ ...

పనిప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం: అడిషనల్ కలెక్టర్ కే.సీతారామారావు

Image
 ​పనిప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం: అడిషనల్ కలెక్టర్ కే.సీతారామారావు గూఢచారి, సూర్యాపేట, డిసెంబర్ 30: స్త్రీలను  పనిచేసే ప్రదేశాల్లో గౌరవించడం మన సంప్రదాయం అని అదనపు కలెక్టర్ కె సీతారామారావు అన్నారు. మంగళవారం సూర్యాపేట సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జరిగిన పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ, నిషేధము మరియు పరిష్కార చట్టంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం  (POSH Act - 2013) సందర్భంగా అదనపు  కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూపనిచేసే చోట మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం మరియు వారి గౌరవానికి భంగం కలగకుండా చూడటం ప్రతి సంస్థ బాధ్యత అని అన్నారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు తమ హక్కుల పట్ల, చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ​అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC): 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆ...

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపల్ ఆఫీస్‌లో ఏసీబీ సర్‌ప్రైజ్ తనిఖీ

Image
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపల్ ఆఫీస్‌లో ఏసీబీ సర్‌ప్రైజ్  తనిఖీ గూఢచారి, కరీంనగర్, డిసెంబర్ 30:  29.12.2025న, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ కరీంనగర్ రేంజ్ యూనిట్ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, చట్టబద్ధమైన రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తులు మరియు మున్సిపల్ కార్యాలయం యొక్క మొత్తం పనితీరును ధృవీకరించడానికి ఏసీబీ బృందానికి ఆడిట్ మరియు సాంకేతిక సిబ్బందితో సహా సంబంధిత విభాగాల అధికారులు సహాయం చేశారు. జమ్మికుంటలోని మునిసిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఆకస్మిక తనిఖీలో, అనేక అవకతవకలు గుర్తించబడ్డాయి, వాటిలో రిజిస్టర్లు మరియు రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం; పరిమిత తిరస్కరణలతో ఆస్తి పన్ను స్వీయ-అంచనాలకు అసాధారణంగా అధిక ఆమోదం, తగినంత పరిశీలన జరగలేదని సూచిస్తుంది; ₹41,170 విలువైన లెక్కల్లో లేని నగదు రికవరీ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఖాతాలో లెక్కించని ఫోన్ పే లావాదేవీలు గమనించబడ్డాయి, ఇది ఆర్థిక అవకతవకలను సూచిస్తుంది; సరైన భౌతిక లేదా ధృవీకరించదగిన ఆన్‌లైన్ రికార్డులు లేకుండా 246 ఎలర్ఎస్  మరియు భవన...

పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలి-మంత్రి జూప‌ల్లి

Image
 *పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలి* *ప‌ర్యాట‌క అద్భుతాలను ప్రపంచానికి చూపండి* *తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం* *వినూత్న ఆవిష్కరణలతో పర్యాటకులను ఆకర్షించాలి* *వసతులు, హాస్పిటాలిటీలో రాజీ పడొద్దు* *టూరిజం అండ్ ఇట్స్ విజన్ – 2026” వర్క్‌షాప్‌లో అధికారులకు మంత్రి జూప‌ల్లి దిశానిర్దేశం* హైదరాబాద్, డిసెంబ‌ర్ 30: తెలంగాణ పర్యాటక రంగం దేశానికే దిక్సూచిగా మారాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మార్పులు తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం తారామతి బరాదరిలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026’ మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టి.జీ.టి.డి.సి రూపొందించిన ‘టేబుల్ క్యాలెండర్‌’ -2026 ను ఆవిష్కరించారు.   ఈ సదస్సులో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరు, నిథమ్ డైరెక్టర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు,...

టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్

Image
 టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్ హైద్రాబాద్, గూఢచారి: GHMCలో అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. ప్రదీప్ కుమార్ కు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 950 జారీచేసింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి ఎమ్. భవానీ రాణి, బీఎస్. చంద్రిక, బి. వెంకన్న లకు పదోన్నతులు కల్పించి నట్లు జీవో లో పేర్కొన్నారు.