ఎన్నికల ప్రక్రియ ప్రారంభం - కాశి సత్రం ఎన్నికల అధికారి


 ఎన్నికల ప్రక్రియ ప్రారంభం - కాశి సత్రం ఎన్నికల అధికారి 

హైద్రాబాద్: గూఢచారి, 16-8-2024, 

 కాశి అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ రోజు నామినేషన్లు తీసుకోవడం ప్రారంభమైందని రేపు సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఆగస్టు 18వ తేదీ స్క్రూట్ని నిర్వహిస్తామని, ఆగస్టు 19 న ఉపసంహరణకు అవకాశం ఉందిని తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ లో నామినేషన్ పత్రాలు 10 తేది రోజున 10.30 నుండి ఇస్తామని తెలిపారు. కాని 10 తేది రోజున 10. 30 నుండి నామినేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభం అని పేర్కొనలేదు. ఈ నామినేషన్ పత్రాల ఇవ్వడం తేదీల్లో నోటిఫికేషన్ లో కొంత గందరగోళం ఉందని పలువురు అనుకుంటున్నారు. ఈ విషయం పై ఎన్నికల అధికారి మాట్లాడుతూ 17వ తేది సాయంత్రం 5వరకు నామినేషన్ పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.

 నామినేషన్ పత్రాలు ఇవ్వడం 10 తేది నుండి ప్రారంభం అయిన 10 తేది నుండి ఈ రోజు వరకు ఎన్నికల అధికారి హైద్రాబాద్ ఆఫీసు లో ప్రతి రోజు నామినేషన్ పత్రాలు జారీ చేయాలి. మరి ఆఫీసు కు వచ్చి జారీ చేశారా? అనేది ప్రశ్న గా మిగిలింది. ఈ విషయం పై మా ప్రతినిధి ఎన్నికల అధికారిని ఈ రోజు సాయంత్రం  వాట్సాప్  మెసేజ్ ద్వారా సంప్రదించగా ఎన్నికల అధికారి నుండి రెస్పాన్స్ రాలేదు.



Also Read

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు