సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్. - అల్లు అర్జున్


 *సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్.* 



 *ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది.* 


 *ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా :అల్లు అర్జున్‌.*



 *సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా.* 



 *శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు.* 


 *20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా :అల్లు అర్జున్‌.*


: *నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి..మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను.* 



 *నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు.* 


 *నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు :అల్లు అర్జున్‌.*


 *థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయాను.* 


 *రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసింది.. నా పిల్లలతో కలిసి సినిమా చూశాను, అలా జరిగిందని నాకు తెలియదు.* 


 *తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారు :అల్లు అర్జున్.*

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్