Posts

Showing posts from September, 2025

*నాడు IVF తరుపున సివిల్స్ కోచింగ్ కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *నేడు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్*

Image
 *చదువుకి పేదరికం అడ్డుకాదు* *నాడు IVF తరుపున సివిల్స్ కోచింగ్ కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *నేడు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్* *పేదరికాన్ని జయించిన చంద్ర కిరణ్* *అభినందనలు తెలిపిన ఉప్పల* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ ఢిల్లీలో శిక్షణ కోసం కావాల్సిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ముషీరాబాద్ లోని వైశ్య బాలుర హాస్టల్ సమావేశ మందిరంలో లంగర్ హౌస్ కు చెందిన ఆర్య వైశ్య ముద్దుబిడ్డ చంద్ర కిరణ్ కి TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  అందజేయడం జరిగింది. ఈ రోజు సివిల్స్ కోచింగ్ తీసుకొని గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ లో వికారాబాద్ జిల్లా లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్ర కిరణ్ కు అభినందనలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ.*

Image
 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ.* ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్‌ వర్మ.  ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ ను బహూకరించిన తిలక్ వర్మ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు.

*ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్*

Image
 *ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్* హైద్రాబాద్:  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ IVF కార్యాలయం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అడ్వైజారీ బోర్డ్ చైర్మెన్ గంజి రాజమౌళి గుప్త అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోనా శ్రీనివాస్ సేవలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గా ఎంపిక చేయడం జరిగింది అని వారు తెలిపారు. IVF బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. అను నిత్యం ఆర్య వైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజకీయంగా ఆర్థికంగా ఆర్య వైశ్యులు ఎదిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజరీ ముత్యాల సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర IVF ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖ...

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి ) లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Image
  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి ) లో ఘనంగా బతుకమ్మ సంబురాలు ప్రకృతిని ప్రకృతితో పూజించే పండుగ బతుకమ్మ మరియు ప్రకృతి పరిరక్షణకు ప్రదాన్యత తెలియజేసే పండుగ బతుకమ్మ. తెలంగాణ అస్థిత్వానికి, సంస్కృతికి, వారసత్వానికి, సంప్రదాయానికి, సనాతన ధర్మానికి తెలంగాణ సామూహిక జీవన విదానానికి బతుకమ్మ ప్రతీక.  బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా బతుకమ్మ వేడుకలను పి సి బి సనత్నగర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఘం నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉద్యోగినిలు నూతన వస్త్రములు దరించి ఉదయం నుండే భక్తి శ్రద్ధలతో తంగేడు పూలు,గునుగు పూలు,బంతి పూలు చామంతులతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక చోట చెర్చి గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మ చుట్టు తిరుగుతూ లయ బద్దంగా రెండు అర చేతులతో చప్పట్లు చెస్టూ.. కాళ్లను కుదుపుతూ శ్రీ రామ రామ వుయ్యాలో, జయ రామ రామ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలతో మహిళా ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు . దీనితో ఆ ప్రాంతం అంత సందడిగా మారింది అనంతరం బతుకమ్మలను నీటి తొట్టెలో నిమజ్జనం చేసారు. అమ్మకు నివేదించిన పలహారాన్ని పంచుకొని అ...

ఏసీబీ వలలో మరో ఇద్దరు

Image
  ఏసీబీ వలలో మరో ఇద్దరు ACB వలలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ఎల్లంపేట మునిసిపాలిటీ, పట్టణ ప్రణాళిక అధికారి 27-09-2025న మల్కాజ్‌గిరి జిల్లా, మేడ్చల్, ఎల్లంపేట మునిసిపాలిటీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ AO  చింతల రాధా కృష్ణ రెడ్డి, తెలంగాణ ACB, సిటీ రేంజ్ యూనిట్-2 చేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ. 3,50,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరించాడు. అంటే "ఇతర భూ యజమానులకు సౌకర్యాలు కల్పించే నెపంతో ఫిర్యాదుదారుడి లేఅవుట్ కాంపౌండ్ వాల్ మరియు గేట్లను కూల్చివేసనందుకు". మొదట AO అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ. 5,00,000/- డిమాండ్ చేశాడు మరియు ఇప్పటికే రూ. 1,50,000/- తీసుకున్నాడు. ఎల్లంపేట మునిసిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ AO శ్రీ చింతల రాధా కృష్ణ రెడ్డిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ################################# టెక్నికల్ అసిస్టెంట్ (అవుట్‌సోర్సింగ్), పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, O/O ది MPDO, కన్నెపల్లి, మంచిర్యాల జిల్లా ACB వలలో ఉన్నారు. 27...

40 వేలు లంచం డిమాండ్ - ACB వలలో సబ్ ఇన్స్పెక్టర్

Image
 40 వేలు లంచం డిమాండ్ - ACB వలలో సబ్ ఇన్స్పెక్టర్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ SHO సబ్ ఇన్స్పెక్టర్ ACB వలలో చిక్కుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పి.ఎస్. మణుగూరు, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ఎస్‌హెచ్‌ఓ (AO) బతిని రంజిత్ పై ACB క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసింది.  మణుగూరు పోలీస్ స్టేషన్‌లో BNS చట్టంలోని సెక్షన్ 318(iv), 296(3) r/w 3(v) కింద నమోదు చేయబడిన Cr. No. 292/2025లో BNSS చట్టంలోని సెక్షన్ 35(3) కింద ఫిర్యాదుదారునికి మరియు అతని సోదరుడికి నోటీసులు జారీ చేసినందుకు బహుమతిగా ఫిర్యాదుదారుని నుండి రూ. 40,000/- లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నామనీ, కేసు దర్యాప్తులో ఉందనీ, . భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామనీ ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని ఏసీ...

11,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన లైన్‌మెన్

Image
 11,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్ 5 కె వి నుండి 11 కె.వి మార్చడానికి విద్యుత్ మీటర్ విప్పి మరలా సీజ్ చేయటానికి 30,000/-డిమాండ్ హైద్రాబాద్:  ఫిర్యాదుధారుని ఇంటికి 5 కె.వి. నుండి 11 కె.వి. వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించడం కోసం వైరింగ్ మార్చడానికి, ఇంట్లో ఉన్న విద్యుత్తు మీటర్‌ను విప్పి మరలా సీల్ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.11,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్ పట్టుబడ్డాడు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును “ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు

Bhupathi Times e-paper 26th Sep. 2025

Image
 

ACB వలలో ఇద్దరు.....

Image
 ACB వలలో ఇద్దరు..... ACB నెట్‌లో వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల వ్యవసాయ అధికారి 24.09.2025న వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం వ్యవసాయ అధికారి AO శ్రీ భూపతి జయ శంకర్ తెలంగాణ ACB, రంగారెడ్డి యూనిట్‌కు పట్టుబడ్డాడు. ఆయన ఫిర్యాదుదారుడి దుకాణానికి ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల లైసెన్స్‌లను జారీ చేసినందుకు అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.1,00,000/- డిమాండ్ చేసి, పాక్షిక చెల్లింపుగా రూ.50,000/- లంచం తీసుకున్నాడు. నిందితుడు తన ప్రజా విధిని అక్రమంగా మరియు నిజాయితీగా నిర్వర్తించాడు. లంచం మొత్తాన్ని అతని తరపున తిరిగి పొందారు. వికారాబాద్ district.is మోమిన్‌పేట్ మండలం వ్యవసాయ అధికారి AO శ్రీ భూపతి జయ శంకర్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ************************************************** తెలంగాణ రాష్ట్ర విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) O/O, వరంగల్ జిల్లా జనగాం సబ్ డివిజన్‌లోని సైట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) ACB నెట్‌లో ఉన్నారు. 25.09.2025న, వరంగల్ జిల్లా జనగాం సబ్-డివిజన్, తెలంగాణ ర...

Bhupathi Times 25th sep. 2025

Image
 

Bhupathi Times e-paper sep. 24th 2025

Image
 

ABVP ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ

Image
 ABVP ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ నల్గొండ:  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్  మాట్లాడుతూ...బతుకమ్మ ప్రత్యేకతలు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, మహిళా శక్తి ప్రతీకగా ఉన్నదనాన్ని విశదీకరించారు.తెలంగాణ ఆడపడుచులు దేవతా స్వరూపిణులుగా భావించి కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతి, ఆయురారోగ్యాలు కోరుకుంటూ ఈ వేడుకను నిర్వహిస్తారని వారన్నారు.బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాకుండా, తెలంగాణ జాతి సాంస్కృతిక గుర్తింపుగా నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణవారు ఏకమై తమ మట్టిమనసు చూపించే వేళగా ఈ పండుగ నిలుస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ABVP రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశ్ణు గారు, నల్గొండ విభాగ్ ప్రముఖ్ ప్ర‌మోద్ , రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఛత్రపతి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ABVP యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్, కార్యదర్శి మోహన్, ప్ర‌త్యూష, వెంకటేష్, విజయ్, సాయి, మౌనేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Bhupathi Times e-paper 23rd sep. 2025

Image
 

టి జి పి సి బి లో శరన్నవరాత్రి ఉత్సవాలు

Image
  టి జి పి సి బి లో శరన్నవరాత్రి ఉత్సవాలు హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) సనత్నగర్ లో దేవి నవరాత్రి వేడుకలు మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారములో అమ్మ వారికి ప్రత్యేక పూజలు. దేవి శరన్నవరాత్రి వుత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) 9 రోజుల దేవి నవరాత్రి పండుగను , భక్తిశ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నారు. సభ్య కార్యదర్శి, అధికారులు మరియు సిబ్బంది కలిసి, ప్రత్యేకముగా అలంకరించిన మండపంలో బాల త్రిపుర సుందరికి సాంప్రదాయ కుంకుమ పూజను నిర్వహించారు. పూజా కార్యక్రమాలు మరియు ఉత్సవాల్లో చురుకుగా పాల్గొని, ప్రాంగణంలో ఆధ్యాత్మికంగా ఉత్సాహభరితమైన శోభ నింపింది.. భక్తిశ్రద్ధలతో శక్తి మరియు శ్రేయస్సు కోరకు అధికారులు మరియు సిబ్బంది అమ్మవారి ఆశీస్సు లను కోరుకున్నారు.. ఈ వేడుకలు ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయం మరియు దైవిక స్త్రీత్వం పట్ల గౌరవాన్ని ప్రతిభించేల సిబ్బంది మరియు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవములు జరుపుకున్నారు.

లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ కేసు & అరెస్టు

Image
 లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ కేసు & అరెస్టు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం, తహశీల్దార్ కార్యాలయం మరియు జాయింట్ సబ్-రిజిస్ట్రార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు మండల సర్వేయర్ పై కేసు నమోదు. తెలంగాణ, ACB, మహబూబ్ నగర్ రేంజ్‌లోని ACB పరిధిలో, 18.09.2025న, మహబూబ్ నగర్ రేంజ్‌లోని ACB పరిధిలో, అవినీతి నిరోధక చట్టంలోని Cr. No. 10/RCO-ACB-MBNR/2025, U/s 7(a) ప్రకారం, ఫిర్యాదుదారుడి నుండి రూ.40,000/- లంచం డిమాండ్ చేసినందుకు, అంటే "ఫిర్యాదుదారుని బంధువుల భూమికి సంబంధించి విచారణ నిర్వహించి, ORC (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్) జారీ చేయడానికి", AO-1 & AO-2 తమ విధులను సక్రమంగా నిర్వహించలేదు ఇది PC చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. అందువల్ల, AO-1 & AO-2 లను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని SPE మరియు ACB కేసుల గౌరవనీయులైన Ist Addl. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. కేసు విచారణలో ఉంది.

పౌర సరఫరాల శాఖ తనిఖీలు

Image
 పౌర సరఫరాల శాఖ తనిఖీలు పెట్రో డీలర్ల గుండెల్లో రైళ్లు  నల్గొండ లో పెట్రోల్ బంక్ ల ఆకస్మిక తనిఖీ  హలో.. ఈస్ ఇట్.. బి పి సి ఎల్ సేల్స్ ఆఫీసర్. అయామ్ మాచన రఘునందన్ ఫ్రమ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. వి ఫౌండ్ .. ఎయిర్ మిషన్ ఈస్ నాట్ వర్కింగ్ సిన్స్ ఫ్యూ మంత్స్.అండ్ టాయిలెట్స్ ఆర్ నాట్ క్లీన్. వి విల్ టేక్ యాక్షన్ అగైనిస్ట్ డీలర్స్.. థోస్ హూ..ఆర్ నెగ్లెక్టిoగ్ పెట్రోల్ మెయింటైన్స్. ఇలా..తనదైన శైలిలో ఆంగ్లం లో అనర్గళంగా మాట్లాడి అటు చమురు సంస్థ ల సెల్స్ అధికారులకు చెమటలు పట్టించి, గుండెళ్లో రైళ్ళు పరిగెత్తించారు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్. శనివారం నాడు ఆయన నల్గొండ లో పెట్రోల్ బంక్ ల ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ వర్కింగ్ స్టైల్..వా..రే..వా అనేలా చేసింది.  పెట్రోల్ బంక్ ల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం డీలర్ల బాధ్యత అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ ఆయా బంకు యాజమాన్యాలకు స్పష్టం చేశారు.నల్గొండ పట్టణం లో పలు పెట్రోల్ బంక్ ల ను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొన్ని ...

*తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

Image
  *తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి* *తీరొక్క పూలతో ప్రకృతిని దైవంగా పూజించే గొప్ప పండుగ* *తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు* - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  *హైదరాబాద్:* తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ మంత్రి "ఎంగిలిపూల" బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.  "ఎంగిలి పూల"బతుకమ్మ తో మొదలై "సద్దుల బతుకమ్మ" వరకు తీరొక్క పూలతో ప్రకృతినే దైవంగా పూజించే గొప్ప పండుగ అని తెలిపారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణం బతుకమ్మ పండుగనీ, సాయుధ రైతాంగ పోరాటంలో,రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెలు,పట్టణాలు అనే తేడా లేకుండా...

ఏసీబీ వలలో తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ & డేట్ ఎంట్రీ ఆపరేటర్

Image
  ఏసీబీ వలలో తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ & డేట్ ఎంట్రీ ఆపరేటర్ ఖమ్మం జిల్లా:  తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ & డేట్ ఎంట్రీ ఆపరేటర్ (అవుట్ సోర్సింగ్) O/O తహసిల్దార్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా ACB వలలో చిక్కారు. 17.09.2025న, (AO-1) వంకాయల సురేష్ కుమార్, తహశీల్దార్. (AO-2) మాలోత్ భాస్కర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మరియు (A-3) శివాజీ రాథోడ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్), ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, తహశీల్దార్ కార్యాలయంలో, ఫిర్యాదుదారుడు తన పేరు మీద కొనుగోలు చేసిన భూమిని ప్రాసెస్ చేయడం మరియు రిజిస్టర్ చేయడం కోసం, ఫిర్యాదుదారుడి నుండి రూ. 10,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB. ఖమ్మం యూనిట్ వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. A-3 నిందితులైన అధికారులందరి తరపున ఫిర్యాదుదారుడి నుండి లంచం మొత్తాన్ని స్వీకరించారు. A-3 వద్ద నుండి అతని వద్ద నుండి కళంకిత లంచం మొత్తం రూ. 10,000/- స్వాధీనం చేసుకున్నారు. అందువలన, AO-1, AO-2 & A-3 లు అనవసరమైన ప్రయోజనాన్ని పొందడానికి తమ విధులను సక్రమంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. అందువల్ల, AO-1. AO-2 &...

పి డి ఎస్ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల జప్తు ఖాయం. - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 పి డి ఎస్ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల జప్తు ఖాయం. - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  నల్గొండ జిల్లా:  రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో ఎక్కువ మార్లు పట్టుబడిన వాహనాల ఆర్ సి రద్దు కు సిఫారసు చేస్తానని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు ఆయన నాంపల్లి లో మాట్లాడుతూ..రేషన్ బియ్యం అక్రమార్కులు రంగారెడ్డి జిల్లా.. నుంచి వచ్చి నాంపల్లి,గుర్రంపోడ్, చింతపల్లి ప్రాంతాల్లో రేషన్ బియ్యం అధిక ధరకు కొనుగోలు చేసే దందా చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.ఒకే వాహనాన్ని మూడు సార్లు, అంతకన్నా ఎక్కువ మార్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా కు ఉపయోగిస్తే అట్టి వాహనం ఆర్ సి తో పాటు వాహనం నడిపిన వ్యక్తి లైసెన్స్ రద్దు కు కూడా సిఫారసు చేస్తానని మాచన రఘునందన్ హెచ్చరించారు.సన్న బియ్యం ను కూడా కొంతమంది వద్ద అధిక ధరకు కొని అమన్ గల్, కడ్తాల్ మీదుగా..మహేశ్వరం, శంషాబాద్ , హైదరాబాద్ కు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ ఆక్షేపించారు.ఈ అక్రమ రవాణా కు పటిష్ట నిఘా తో చెక్ పెట్టనున్నట్టు వివరించారు.రేషన్ బియ్యం అక్రమ రవాణా లో కొ...

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Image
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  Nalgonda:  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశించారు.

TGPCB లో ఘనంగా తెలంగాణ పరిపాలన దినోత్సవం

Image
TGPCB లో ఘనంగా తెలంగాణ పరిపాలన దినోత్సవం హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) ప్రధాన కార్యాలయం సనత్‌నగర్లో ప్రాంగణంలో ఈరోజు తెలంగాణ పరిపాలన దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి జి రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. మండలిలోని అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులకు మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకులకు నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలు, ఐక్యత మరియు దేశభక్తిని పాటించేందుకు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి ప్రసంగిస్తూ, భారతదేశంలో తెలంగాణ విలీనం జరిగిన చారిత్రాత్మక ఘట్టమని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యం, ఐక్యత మరియు సమగ్రత విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు టీఎస్పీసీబీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ విమోచన కోసం పోరాడిన నాయకులకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఏసీబీకి సోదాల్లో నిందితుడి బినామీగా అనుమానించబడిన ఒకరి ఇంట్లో రూ. 2,18,00,000/- నగదు

Image
  ఏసీబీకి సోదాల్లో  నిందితుడి బినామీగా అనుమానించబడిన ఒకరి ఇంట్లో రూ. 2,18,00,000/- నగదు  అంబేద్కర్ ఎరుగు, ADE, (ఆపరేషన్స్), TGSPDCL, ఇబ్రహీంబాగ్, హైదరాబాద్ పై అసమాన ఆస్తుల కేసు తన సర్వీసు కాలంలో చట్టవిరుద్ధమైన పద్ధతులు మరియు సందేహాస్పద మార్గాల ద్వారా ఈ ఆస్తులను సంపాదించినందుకు హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లోని TGSPDCL అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్స్  అంబేద్కర్ ఎరుగుపై తెలిసిన ఆదాయ వనరులకు అసమాన ఆస్తుల కేసు నమోదు చేయబడింది. పైన పేర్కొన్న నిందితుడి ఇంట్లో మరియు అతని మరియు అతని బంధువులకు చెందిన 10 ఇతర ప్రదేశాలలో సోదాలు జరిగాయి. ఈ సోదాలలో షెర్లింగంపల్లిలోని ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని ఒక G+5 భవనం, 10 ఎకరాల భూమిలో అమ్తార్ కెమికల్స్ పేరుతో ఉన్న ఒక కంపెనీ, హైదరాబాద్‌లోని 6 నివాస ప్రధాన ఓపెన్ ప్లాట్లు, ఒక వ్యవసాయ భూమి, రెండు నాలుగు చక్రాల వాహనాలు, బంగారు ఆభరణాలు మరియు బ్యాంక్ డిపాజిట్లు బయటపడ్డాయి. ఈ సోదాలలో నిందితుడి బినామీగా అనుమానించబడిన ఒకరి ఇంట్లో రూ. 2,18,00,000/- నగదు కూడా కనుగొనబడింది. పైన పేర్కొన్న నిందితుడి అధికారి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ఈ చ...

PCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం

Image
  PCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం. హైద్రాబాద్:  ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2025ను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) 2025 సెప్టెంబర్ 16న సనత్నగర్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఓజోన్ను క్షీణింపజేసే రసాయనాలను నిర్మూలించడం, ఓజోన్ పొర రక్షణ ప్రజలకు తెలియజేయడం ప్రధాన ఉద్దేశ్యం. టి జి పి సి బి సభ్య కార్యదర్శి  రవి మాట్లాడుతూ “భూమిని సూర్యుని నుండి వచ్చే హానికర అల్ట్రావయొలెట్ కిరణాల నుండి కాపాడే రక్షాకవచంలా, ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్ లోని క్రింది భాగంలో ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు (CFCs), హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు (HCFCs) వంటి రసాయనాలు ఓజోన్ పొరను క్షీణింపజేస్తాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్, కంటి ముత్యంబిందు వంటి వ్యాధులు వస్తాయి. ఓజోన్ పొరను రక్షించడానికి చెట్లు నాటడం, పర్యావరణానుకూల ఉత్పత్తులను ఉపయోగించడం, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడం అవసరం. ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలను నిర్మూలించడం, ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. ఈ ప్రయత్నం ఇప్పటికే చాలా మంచి ...

కస్తూరిబా & ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ పై ఏసీబీ రైడ్స్

Image
  కస్తూరిబా & ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ పై ఏసీబీ రైడ్స్  ACB RAIDS TRIBAL WELFARE ASHRAM HIGH SCHOOL, SAI KUNTA, MANCHERIAL TOWN AND DISTRICT 10.09.2025 రోజున మంచిర్యాల పట్టణం మరియు జిల్లాలోని సాయికుంటలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ACB ఆదిలాబాద్ యూనిట్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ACB బృందాలకు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ. శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు ఆడిటర్ సహాయం అందించారు, వారు ఆహారం నాణ్యత, పరిమాణం, పారిశుద్ధ్య పరిస్థితులు, విద్యార్థుల బల వివరాలు, రికార్డులు మొదలైన వాటిని తనిఖీ చేశారు. సోదాల సమయంలో, ప్రాంగణంలో అపరిశుభ్ర నిర్వహణ, గదుల నిర్వహణ సరిగా లేకపోవడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కొన్ని అవకతవకలు గుర్తించబడ్డాయి. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నివేదిక పంపబడుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. ££££££££££££££££££££££££££££££££££££ ACB RAIDS KASTHURBHA GANDHI BALIKALA VIDYALAYAM, BOINPALLI VILLAGE AND MANDAL, RAJANNA SIRCILLA DISTRICT ఈరోజు అనగా 10.09.2025న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి గ్రామం మర...

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ మందికి సహాయం అందించేలా కృషి చేయండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ మందికి సహాయం అందించేలా కృషి చేయండి -  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Nalgonda:            జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.           బుధవారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు, పిఓబి భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు.           మండలంలో అన్ని గ్రామాల వారిగా ఏప్రిల్ 2017 నుండి మరణించిన వారి వివరాలను తెప్పించుకుని అందులో నుండి కుటుంబ పెద్ద మగ లేదా ఆడ ఎవరు చనిపోయిన అలాంటి వారి వివరాలు సేకరించి సంబంధిత కుటుంబ సభ్యుల సహకారంతో మరణ ధ్రువీకరణ పత్రము, ఆధార్, ఇతర ధృపత్రాలను జత చేసి జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను పంపించాలని అన్నారు. ఒకేసారి చనిపోయిన పెద్ద ఇంటి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం వస్తున్నందున ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధికారులు చర్య...

రేషన్ దొంగల పై పి డి యాక్ట్ - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 రేషన్ దొంగల పై పి డి యాక్ట్  - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  Nalgonda:  రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అలవాటు పడిన వారి పై పి డి యాక్ట్ నమోదు చేస్తున్నట్టు, పి డి ఎస్ కేసుల్లో ఎక్కువ మార్లు పట్టుబడిన వాహనాల జప్తు కు సైతం సిఫారసు చేస్తానని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు ఆయన నాంపల్లి లో మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యం అక్రమార్కులు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అధిక ధరకు కొనుగోలు చేసే దందా చేస్తున్నారని చెప్పారు. ఒకే వాహనాన్ని ఎక్కువ మార్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా కు ఉపయోగిస్తే ఆ వాహనం నడిపిన వ్యక్తి లైసెన్స్ రద్దు కు సిఫారసు చేస్తానని మాచన రఘునందన్ హెచ్చరించారు.సన్న బియ్యం ను కూడా కొంతమంది వద్ద అధిక ధరకు కొని అమన్ గల్, కడ్తాల్ మీదుగా..మహేశ్వరం, శంషాబాద్ , హైదరాబాద్ కు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ ఆక్షేపించారు.ఈ అక్రమ రవాణా కు పటిష్ట నిఘా తో చెక్ పెట్టనున్నట్టు వివరించారు.కొన్ని పోలీస్ స్టేషన్ల లో ఒక్కో వ్యక్తి పై పది కేసులు న...

రేషన్ రసీదు అడిగి తీసుకోండి - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 రేషన్ రసీదు అడిగి తీసుకోండి - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  Nalgonda:  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించే రేషన్ షాపుల్లో .. రేషన్ రసీదు ను ప్రజలు అడిగి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన మర్రిగూడ లో చౌక దుకాణాల ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు రేషన్ తీసుకున్నాక రేషన్ తాలుకు రసీదు కూడా అడిగి తీసుకోవాలని సూచించారు.జాతీయ ఉస్పత్తి పథకం లో.. పారాదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సాంకేతిక మార్పులు వచ్చాయన్నారు. ఐనా కానీ ప్రజలు చౌక దుకాణాల నుంచి రేషన్ వస్తే చాలు అన్న చందాన రసీదు లు అడిగి తీసుకోవడం లో ఆసక్తి చూపెట్టక"పోవడం" వల్ల రేషన్ లో అక్రమాలు జరిగేందుకు అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.లబ్ది దారులు ఎంత జాగరూకత గా ఉంటే..అన్ని మోసాలను , అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని రఘునందన్ స్పష్టం చేశారు.కొందరు డీలర్లు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి, అన్ని సరకులు ఇచ్చినట్టు రసీదు తీసి, జనం అడగటం లేదు కదా అని తమ వద్దే పెట్టుకున్నారని రఘునందన్ ఆక్షేప...

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీ జి పీ సీ బీ) లో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

Image
  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీ జి పీ సీ బీ) లో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణా భాష దినోత్సవంగా పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి. హైద్రాబాద్:  మన భాషే మన ఊపిరి ప్రజా కవి కాళోజీ జన్మ దినం.ఈ పర్వ దినాన్ని తెలంగాణా భాష దినోత్సవంగా జేసుకొని సంబరాలు పడుతున్నాం.మన"బాష బడి పలుకుల భాష” మాత్రేమ కాదు “పలుకు బడుల బాష”గా గౌరవం పొందే రోజు రావాలని కాళోజీ యెంతగానో తపన పడ్డాడు. అందు కోసమే తన ప్రతి రాతల ఆ భాషకు కావ్య గౌరవం దక్కేటట్టు రాసుకొచ్చిండు.ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీజిపీసీబీ) కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది కాళోజి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కాళోజి గారి తెలంగాణ సాహిత్యం, స్వాతంత్ర్య పోరాటం, సామాజిక సేవలో చేసిన విశిష్టమైన కృషిని స్మరించుకున్నారు. ఆయన రచనలు సామాన్య ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ, మానవతా విలువలు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాయని గుర్తుచేశారు. కాళోజి గారి జీవన విధానం, నిస్వార్థ సేవా తత్త్వాన్ని అభినందిస్తూ, ...

ACB వలలో టౌన్ ప్లానింగ్ అధికారి - 4లక్షల లంచం

Image
 నార్సింగి మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు: టౌన్ ప్లానింగ్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నార్సింగి మున్సిపల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ACB) నర్సింగి మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం, ముంచిరేవుల నివాసి వినోద్ తన ప్లాట్ యొక్క LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) క్లియర్ చేయడానికి ఆమె ₹10 లక్షలు లంచం డిమాండ్ చేసింది. ఈరోజు లంచం యొక్క మొదటి విడతగా మణిహారిక ₹4 లక్షలు స్వీకరించిందని, ఆ సమయంలో ACB బృందం వేగంగా చర్య తీసుకుని ఆమెను అరెస్టు చేసిందని వర్గాలు తెలిపాయి.

*వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తాం* *...నీట్ పేరెంట్స్ అసోసియేషన్*

Image
 *వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తాం* *...నీట్ పేరెంట్స్ అసోసియేషన్* *హైదరాబాద్:* వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణచారి అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఎల్బీనగర్ శ్రీ రామచంద్ర మిషన్ వెల్నెస్ సెంటర్లో రాష్ట్రస్థాయి నీట్ పేరెంట్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా మల్లోజు సత్యనారాయణచారి, , ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా బొడ్డుపల్లి అంజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అలాగే జాయింట్ సెక్రెటరీలుగా దొడ్డేపల్లిరఘుపతి, రాజుగౌడ్, చీఫ్ అడ్వైజర్ గా బీరెల్లి కమలాకర్ రావు, కోశాధికారిగా ఎం . శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్. భాస్కర్ రావు, కే. రవి కుమార్, పి. సుజాత, కార్యవర్గ సభ్యులుగా గడ్డం స్వప్న, పబ్బం మానస, కే నరహరి, టి. రత్న ప్రసాద్, నరేందర్ రెడ్డి లను  ఎన్నుకోవడం జరిగింది.సుమారు 1000 మంది వరకు పాల్గొన్న ఈ సమావేశంలో వైద్య విద్యార్థులకు స్థానికత కల్పి...

ధనా..ధన్ రఘునందన్ ప్రజా పంపిణీ బియ్యం తో దందా చేస్తే అరదండాలే

Image
 ధనా..ధన్ రఘునందన్ ప్రజా పంపిణీ బియ్యం తో దందా చేస్తే అరదండాలేనని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు మాల్ నుంచి చింతపల్లి వరకు విస్తృత ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కిరాణా దుకాణాలు,రైస్ మిల్లుల ను రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న అనుమానం తో చెక్ చేసినట్టు చెప్పారు.రేషన్ ఎక్కడ దాచి పెట్టినా వెలికి తీసి కేసు నమోదు చేయడం ఖాయం అని  మార్వాడి లకు గట్టి వార్నింగ్ ఇచ్చానన్నారు.రేషన్ బియ్యం దందా చేస్తే అరదండాలే అని హెచ్చరించారు.ఆయా రైస్ మిల్లు ల్లో ఉన్న బియ్యం నిల్వలను చెక్ చేశారు.రైస్ మిల్లు ల్లో ధాన్యం మర పట్టిన వివరాలు పొందుపరచాలని సూచించారు.

ఏసీబీ వలలో ఒకే రోజు ఇద్దరు

Image
  ఏసీబీ వలలో ఒకే రోజు ఇద్దరు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని సీనియర్ అసిస్టెంట్, ఐ/సి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ నెట్‌లో ఉన్నారు. 03-09-2025న, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న నిందితుడు (AO), కర్ణ శ్రీనివాస్ రావు ఫిర్యాదుదారుడి నుండి ₹7,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB అధికారులు అరెస్టు చేశారు. ప్రారంభంలో, AO ₹10,000 డిమాండ్ చేశారు, కానీ తరువాత అధికారిక అనుకూలంగా వ్యవహరించడం కోసం అంటే "VLT ఫైల్‌ను ప్రాసెస్ చేయడంలో జాగ్రత్త వహించడం, VLT నంబర్‌ను కేటాయించడం మరియు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా ఫిర్యాదుదారుడి దుకాణం సజావుగా పనిచేసేలా చూసుకోవడం" కోసం ₹7,000 కు తగ్గించారు. AO వద్ద నుండి ₹7,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనవసర ప్రయోజనం పొందడానికి AO తన విధులను నిర్వర్తించడంలో అనుచితంగా మరియు నిజాయితీగా వ్యవహరించాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి గుర్తింపును నిలిపివేశారు. అందువల్ల, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ఐ/సి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిన ఎఓ ...

ఉప్పల నివాసానికి ఉత్తర ప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్

Image
 *ఉప్పల నివాసానికి ఉత్తర ప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్* *ఘనంగా సన్మానించిన ఉప్పల* నాగోల్ లోని ఉప్పల నివాసానికి ఉత్తర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి విద్య శాఖ మంత్రి మరియు IVF సెంట్రల్ కమిటీ అడ్వైజర్ కపిల్ దేవ్ అగర్వాల్  రావడం జరిగింది. ఈ సందర్బంగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా వారు దేశ వ్యాప్తంగా వున్న ఆర్య వైశ్యుల అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యాచరణ మీద చర్చించడం జరిగింది. కపిల్ దేవ్ అగర్వాల్ గారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ హక్కుల కోసం పోరాడాలని ఆయన అన్నారు. రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆయన చెప్పారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త  మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటాను అని త్వరలోనే లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్య వైశ్యులు అందరూ పోటీ చేసి తమ సత్తా చాటాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వై...

Bhupathi tumes

 

టి.జి.పి.సి.బి లో ఘనంగా గణేష్ చతుర్ధి వేడుకులు

Image
   టి.జి.పి.సి.బి లో ఘనంగా గణేష్ చతుర్ధి వేడుకులు పర్యావరణ సృహతో కూడిన గరిణేష్ నవరాత్రోత్సవాలా పండుగ వేడుకులను జరుపుకున్న పి.సి.బి. పి.సి.బి సనత్ నగర్ కార్యాలయములో ప్రతిష్టించిన మట్టి గణపతికి సభ్య కార్యరళ్శ్మి జి. రవి, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సోమవారం గణేష్ నిమజ్జనానికి తరలించి ముందు ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఈ సంర్వహించారుదర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరము 3.24 లక్షల మట్టి విగ్రహలు పంపిణీ చేసామన్నారు. ప్రత్యేకంగా తీర్చి దిద్భన మండపములో పర్యావరణ అనుకూల మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించి, మండపం అలంకరణకు కూడ వినియోగించిన వస్తువులు పదార్థములు ఎకోఫ్రెండ్లి అని తెలిపారు. అనంతరం పి.సి.బి ఆద్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేసారు. బోర్టు సిబ్బంది, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి రఘు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు, jcee కృపానంద్, సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్నకుమార్,, See జవహర్ లాల్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రెసిడ...