కెనడా టొరంటోలో డర్‌హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025
*కెనడా టొరంటోలో డర్‌హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన – డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025(ఫ్యామిలీ ఫెస్టివల్ 2025)* కెనడాలోని డర్‌హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో, కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్‌తో “డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025:” వేడుకలు టొరంటోలోని మ్యాక్స్‌వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సుమారు 800కి పైగా తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నాయి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల సంతోష్ కుంద్రు, అలాగే యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. డి.టి.సి ఎగ్జిక్యూటివ్ కమిటీసభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవకుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి గార్ల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత కెనడా జాతీయ గీతం మరియు మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ఘనంగా ప...