జి హనుమంతరెడ్డి టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (జె.సి.ఇ.ఇ)జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పదవీ విరమణ

జి హనుమంతరెడ్డి టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (జె.సి.ఇ.ఇ)జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పదవీ విరమణ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) జి హనుమంతరెడ్డి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ సోమవారంపదవీ విరమణ చేశారు. ఈ సందర్భం గా పీసీబీ ఏర్పటు చేసిన కార్యక్రమo లో సభ్య కార్యదర్శి జి.రవి మాట్లాడుతూ హనుమంత రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సంస్థకు ఆయన 36 సంవత్సరాలు అంకితభావంతో చేసిన సేవలను ప్రశంసించారు. హనుమంత రెడ్డి లాగ ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.పదవీకాలంలోతనకు సహకరించిన అధికారులకు సిబ్బంధికి. ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టిజిపిసిబి అధికారులు మరియు సహచరులు ఆయన పదవీకాలంలో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. సిబ్బంది, అధికారులు శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి. రఘు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ...